News9th Oct 12:13 PMSunil Byrisetty1 min read
బీసీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు
సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ జరిపింది. బీసీ రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్ట
సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ జరిపింది. బీసీ రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టేసింది. ప్రభుత్వం నిర్వహించిన కుటుంబ సర్వేను ఏ రకంగా ప్రామాణికంగా తీసుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. ఏపీ ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహిత్గి ఎందుకు తీసుకోకూడదని అడిగారు. అందుకోసం పూర్తిస్థాయిలో వాదనలు వినిపించేందుకు ముకుల్ రోహిత్గి సమయం కోరారు. సమయం ఇవ్వాలన్న అభ్యర్థనను నిరాకరిస్తూ పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.