Telangana23rd Sep 12:23 PMSunil Byrisetty1 min read

ఓటుకు నోటు కేసులో తీర్పు రిజర్వ్

ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. కేసులో ఏ4 ముద్దాయి జెరూసలేం మత్తయ్య పేరును హైకోర్టు క్వాష్ చేయడాన్ని సవాల్ చేస్తూ 2016లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆ

ఓటుకు నోటు కేసులో తీర్పు రిజర్వ్
ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. కేసులో ఏ4 ముద్దాయి జెరూసలేం మత్తయ్య పేరును హైకోర్టు క్వాష్ చేయడాన్ని సవాల్ చేస్తూ 2016లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రాథమిక దశలోనే ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయడంపై విచారణకు ప్రభావం పడుతుందని.. మత్తయ్యను విచారించేందుకు అనుమతి కావాలని 9 ఏళ్లుగా తాము సుప్రీంకోర్టును కోరుతున్నామని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. మత్తయ్య సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌లో లేడని, దొరికినప్పుడు సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌లో ఉన్న వ్యక్తులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, A1, A2,A3లు అని మత్తయ్య తరపు న్యాయవాది చెప్పారు. ఇవన్నీ పరిశీలించే హైకోర్టు మత్తయ్యపై ఎఫ్ఐఆర్ కొట్టేసిందని తెలిపారు. ఇరు వైపులా వాదనలు విని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.
Telangana
Supreme Court
Voting Note Case
FIR
Legal Proceedings
High Court
Revanth Reddy
Court Verdict
Muttayya
సీన్ ఆఫ్ ఆఫెన్స్
హైకోర్టు తీర్పు
కోర్టు వాదనలు
రాజకీయ కేసులు
Scroll for the next article