National24th Jul 01:56 PMSunil Byrisetty1 min read
నీట్‌ను ఏం సంస్కరించారు?: సుప్రీంకోర్టు
నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిన ఘటన దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. అనంతరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరోసారి నీట్ నిర్వహించి, ఫలితాలు కూడా విడుదల చేసింది. అయితే లీక్ తర్వాత చేపట్టిన
నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిన ఘటన దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. అనంతరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరోసారి నీట్ నిర్వహించి, ఫలితాలు కూడా విడుదల చేసింది. అయితే లీక్ తర్వాత చేపట్టిన సంస్కరణల అమలుపై సుప్రీంకోర్టు కీలక ప్రవ్నలు వేసింది. పేపర్ లీక్ తర్వాత కేంద్ర ప్రభుత్వం, జాతీయ పరీక్షల సంస్థ ఏం సంస్కరణలు చేపట్టిందనే సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పరీక్షల పారదర్శకత, భద్రతా చర్యలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పరీక్షా విధానంలో లోపాలను సరిదిద్దేందుకు తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టిన సంస్కరణలపై పూర్తి వివరాలు అందించాలని స్పష్టం చేసింది. మరోవైపు నీట్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు కొనసాగిస్తోంది.