Sports11th Sep 12:41 PMSunil Byrisetty1 min read

భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై పిటిషన్‌

ఆసియా కప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దానిని అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరగా అత్యున్నత న్యాయస్థానం ఈ వి

భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై పిటిషన్‌
ఆసియా కప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దానిని అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరగా అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది. ‘అంత అత్యవసరం ఏమిటి? అది కేవలం ఒక మ్యాచ్‌. అలా జరగనివ్వండి. మ్యాచ్‌ ఆదివారం ఉంది. ఏం చేయాలి?’ అని జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌ల ధర్మాసనం పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాదిని ప్రశ్నించింది. ఆదివారం మ్యాచ్‌ ఉందని, శుక్రవారం జాబితాలో చేర్చకపోతే తన పిటిషన్‌ నిష్ఫలమవుతుందని న్యాయవాది కోర్టుకు తెలిపారు.
Cricket
India Vs Pakistan
Asia Cup 2025
Supreme Court
Sports Update
India Pakistan Match
Court Case
Asia Cup Cricket
Supreme Court Of India
Scroll for the next article