National15th Oct 12:12 PMSunil Byrisetty1 min read

హిందూయేతరులకు బీసీ రిజర్వేషన్లు చెల్లవు

ఇస్లాం మతంలోకి మారిన హిందూ వ్యక్తులు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు ఈ కేసులో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. జ

హిందూయేతరులకు బీసీ రిజర్వేషన్లు చెల్లవు
ఇస్లాం మతంలోకి మారిన హిందూ వ్యక్తులు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు ఈ కేసులో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ చంద్రశేఖర్‌ ధర్మాసనం వాదనల సందర్భంగా ఈ మేరకు తీర్పును వెలువరించింది. హిందూ సామాజిక వ్యవస్థ నుంచి హిందూయేతర సామాజిక వ్యవస్థలోకి మారిన ఏ వ్యక్తి కూడా బీసీ రిజర్వేషన్ ప్రయోజనాలను క్లెయిమ్ చేయలేరని పేర్కొంది. వెనుకబడిన తరగతులకు చెందిన ముస్లింలలో 7 శాఖల వారికి బీసీ గుర్తింపునిస్తూ తమిళనాడు ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. దీన్ని మద్రాస్ హైకోర్టు రద్దు చేయగా.. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. తాజాగా హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ సుప్రీంకోర్టు తుది తీర్పునిచ్చింది.
Scroll for the next article