News12th Jan 02:40 PMSunil Byrisetty1 min read
ఏపీకి లైన్ క్లియర్.. తెలంగాణకు షాక్
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏపీకి లైన్ క్లియర్ అయింది. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్ట్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏపీకి లైన్ క్లియర్ అయింది. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్ట్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టును నల్లమల సాగర్‌తో లింక్ చేయడం వల్ల తెలంగాణకు నష్టమని, గోదావరి నీటి కేటాయింపులు ఉల్లంఘన అవుతున్నాయని కోర్టుకు తెలంగాణ వివరించింది. వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఈ పిటిషన్ ను కొనసాగించలేమని, ఈ కేసుతో కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలు కూడా ముడిపడి ఉన్నాయని వ్యాఖ్యానించింది. అందుకే, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు (మీడియేషన్ లేదా సివిల్ సూట్) ద్వారా పరిష్కారం కోరవచ్చని సూచించింది. దీంతో, తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని సుప్రీంకోర్టుకు తెలంగాణ తెలిపింది.