News7th Nov 03:19 PMSunil Byrisetty1 min read

నిర్బంధ పదవీ విరమణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

నిర్బంధ పదవీ విరమణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగిని నిర్బంధ పదవీ విరమణ చేయడం అనేది శిక్షాత్మక చర్య కాదని, అలాగే ఉద్యోగి ప్రవర్తనపై నిందారోపణ మోపినట్లు లేద

నిర్బంధ పదవీ విరమణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
నిర్బంధ పదవీ విరమణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగిని నిర్బంధ పదవీ విరమణ చేయడం అనేది శిక్షాత్మక చర్య కాదని, అలాగే ఉద్యోగి ప్రవర్తనపై నిందారోపణ మోపినట్లు లేదా అతను ఏదైనా తప్పు చేసినట్లు నిర్ధారించినట్లు భావించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ మన్మోహన్, జస్టిస్ చంద్రశేఖర్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సదరు ఉద్యోగిని ఇకపై సర్వీసులో కొనసాగించడం సముచితం కాదని సంబంధిత సమర్థ అధికారి భావించినప్పుడు నిర్బంధ పదవీ విరమణ ఉత్తర్వులు జారీ చేయవచ్చు. ఒక ఉద్యోగి పరిపాలనా సామర్థ్యానికి ఉపయోగపడని స్థితికి చేరుకున్నాడా? అతని కొనసాగింపు వల్ల ప్రభుత్వ పరిపాలనా సామర్థ్యం దెబ్బతింటుందా? అనే అంశాలను నిర్ణయించడం కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలో ఉంటుందని పేర్కొంది. అయితే ఈ నిర్ణయం కేవలం ఊహాగానాలు, వ్యక్తిగత అభిప్రాయాలు లేదా ఇష్టానుసారంగా ఉండకూడదని కూడా పేర్కొంది.
Scroll for the next article