News6th Oct 05:11 PMSunil Byrisetty1 min read
బీసీ రిజర్వేషన్లపై పిటిషన్.. కొట్టేసిన సుప్రీం!
బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. హైకోర్టులో విచారణలో ఉంటే సుప్రీంకోర్టులో ఎందుకు
బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. హైకోర్టులో విచారణలో ఉంటే సుప్రీంకోర్టులో ఎందుకు పిటిషన్ వేయాల్సి వచ్చిందని ధర్మాసనం పిటిషనర్లను ప్రశ్నించింది. గత విచారణలో హైకోర్టు స్టే ఇవ్వలేదని అందుకే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని వారు తెలిపారు. అయితే స్టే రాకపోతే పిటిషన్ వేస్తారా…హైకోర్టులో విచారణలో ఉన్న అంశంపై తాము ఎలా విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రిజర్వేషన్లను పెంచుతూ జీవో ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. వెంటనే స్థానిక ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ జారీ చేసింది. అందులో రిజర్వేషన్లను బీసీలకు 42 శాతం కేటాయించారు. ఈ కేటాయింపు వల్ల సుప్రీంకోర్టు నిర్దేశించిన యాభై శాతం రిజర్వేషన్ల పరిమితి దాటిపోతోందని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది. విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది.