Politics7th Aug 11:38 AMSunil Byrisetty1 min read
‘సర్వే’ం మాయ!
తెలుగు రాష్ట్రాల్లో ‘సర్వే’రాయుళ్లు బయలుదేరారు. దేశమంతా సర్వేల సందడి ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆ వేడి మరింత ఎక్కువ. ఇటీవల కొందరు ఫలానా నియోజకవర్గంలో సర్వే పూర్తి చేశాం.. అక్క
తెలుగు రాష్ట్రాల్లో ‘సర్వే’రాయుళ్లు బయలుదేరారు. దేశమంతా సర్వేల సందడి ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆ వేడి మరింత ఎక్కువ. ఇటీవల కొందరు ఫలానా నియోజకవర్గంలో సర్వే పూర్తి చేశాం.. అక్కడ ఆ పార్టీదే పైచేయి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి బిజినెస్ చేసుకుంటున్నారు. ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీ నాయకులు, శ్రేణులు దాన్ని వైరల్ చేసి పారేస్తారు. అయితే క్లయింట్లను పెంచుకునేందుకే ఈ ఎత్తుగడ అని వైరల్ చేసే బ్యాచ్ కు తెలియదు. ఆలోపే సర్వేలు, శాంపిళ్లంటూ పార్టీలతో బిజినెస్ లు మొదలైపోతాయి. వారు చేసే సర్వేలు, చూపించే శాంపిళ్లకు ఏమాత్రం ధ్రువీకరణ లేకపోయినా ఆయా పార్టీలు మాత్రం ప్రచారానికి సిద్ధమైపోతున్నాయి.