News13th Jun 04:38 PMSunil Byrisetty1 min read
బెలూం గుహలకు ''భౌగోళిక వారసత్వ'' గుర్తింపు
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపు దక్కడం ఆనందకరమని రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపు దక్కడం ఆనందకరమని రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భౌగోళిక వారసత్వ ప్రాంతంగా గుర్తింపు పొందడంతో దేశ పర్యాటక ప్రదేశాల పటంలో మన బనగానపల్లె నియోజకవర్గంలో కొలువైన బెలూం గుహలకు స్థానం దక్కడం మనందరికీ గర్వకారణమని కొనియాడారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద, దేశంలో పొడవైన గుహలుగా ప్రసిద్ధి చెందాయని చెప్పారు. బెలూం గుహలకు భవిష్యత్తులో మరింత ప్రాచుర్యం కల్పించే విధంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు నెలవైన బనగానపల్లె నియోజకవర్గం, నంద్యాల జిల్లాలను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు తోడ్పాటు అందిస్తాం.. ప్రతి ఏటా లక్షల మంది పర్యాటకులు వచ్చే బెలూం గుహలను పర్యాటక ప్రాంతంగా మరింతగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానికంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని వివరించారు.