News18th Sep 09:11 AMSunil Byrisetty1 min read
అద్భుతంగా సూర్యలంక బీచ్ ఫెస్టివల్
బాపట్ల జిల్లాలోని ఆహ్లాదకరమైన సూర్యలంక బీచ్‌లో ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు బీచ్ ఫెస్టివల్ ను అద్భుతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రుల బృందం అధికారులన
బాపట్ల జిల్లాలోని ఆహ్లాదకరమైన సూర్యలంక బీచ్‌లో ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు బీచ్ ఫెస్టివల్ ను అద్భుతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది. సచివాలయంలో రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, అనగాని సత్యం ప్రసాద్ గొట్టిపాటి రవికుమార్ తో కూడిన మంత్రుల బృందం సూర్యలంక బీచ్ ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్లపై చర్చించి ఆదేశాలను జారీచేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల అనుసంధానంగా నిర్వహించబడుతున్న నేపద్యంలో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ ఫెస్టివల్ నిర్వహణ ద్వారా సూర్యలంక బీచ్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మంచి గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. పర్యాటకులకు ఆహ్లదం కలిగించే విధంగా క్రీడలు, క్రీడా సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.