News26th Oct 05:41 PMSunil Byrisetty1 min read
ట్రెండింగ్ లో సూర్యలంక.. గోవాను మించి!
ఏపీలోని బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ప్రస్తుతం ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఒకప్పుడు బెస్ట్ బీచ్ ఎక్స్ పీరియన్స్ అంటే గోవా బెస్ట్ ప్లేస్ గా పేరుప
ఏపీలోని బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ప్రస్తుతం ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఒకప్పుడు బెస్ట్ బీచ్ ఎక్స్ పీరియన్స్ అంటే గోవా బెస్ట్ ప్లేస్ గా పేరుపొందింది. కానీ ఇక నుంచి గోవా తరహా ఆహ్లాదాన్ని అందుకోవడానికి అంత దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదని, బాపట్ల సూర్యలంక బీచ్ ను గోవా బీచ్ల్ మాదిరి అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామంటూ సీఎం చంద్రబాబు ప్రకటన నిజమేనని బీచ్ ని సందర్శించేందుకు వస్తున్న పర్యాటకులు అంటున్నారు. బీచ్ సమీపంలో వెలుస్తున్న రిసార్ట్స్ పర్యాటకుల మనసు దోచుకుంటున్నాయి. ఒక్కో రిసార్ట్ ఒక్కో థీమ్ తో పర్యటకులను ఆకర్షిస్తూ ముందుకెళుతున్నాయి. కూటమి ప్రభుత్వ రాకతో సూర్యలంక బీచ్ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ఒకటిరెండు రోజులు ఫ్యామిలీతో సరదగా చిల్ అవ్వడానికి అటు హైద్రాబాద్ తోపాటుగా పరిసర ప్రాంతాల ప్రజలు సైతం పెద్ద ఎత్తున సూర్యలంక బీచ్ ను సందర్శిస్తున్నారు. ఇటు ఏపీలోనూ వివిధ ప్రాంతాల నుంచి ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో సరదాగా సమయం గడిపేందుకు సూర్యలంక వైపు చూస్తున్నారు. గతంతో పోలిస్తే ఇక్కడ పర్యటకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.