News2nd Dec 11:31 AMSunil Byrisetty1 min read

సస్పెన్షన్లోనూ పీవీ సునీల్ వ్యాఖ్యలు!

ఏపీ ఐపీఎస్ అధికారుల్లో సీనియర్లలో ఒకరు అయిన పీవీ సునీల్ వ్యవహారం అధికారవర్గాల్లోనే కాదు రాజకీయవర్గాల్లోనూ సంచలనం అవుతోంది. అయినా అడ్డగోలు తప్పు చేసి కులం చాటున దాక్కుని రక్షణ పొందా

సస్పెన్షన్లోనూ పీవీ సునీల్ వ్యాఖ్యలు!
ఏపీ ఐపీఎస్ అధికారుల్లో సీనియర్లలో ఒకరు అయిన పీవీ సునీల్ వ్యవహారం అధికారవర్గాల్లోనే కాదు రాజకీయవర్గాల్లోనూ సంచలనం అవుతోంది. అయినా అడ్డగోలు తప్పు చేసి కులం చాటున దాక్కుని రక్షణ పొందాలని అనుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు నేతలతో తనకు మద్దతుగా మాట్లాడించుకుని .. తాను రాజకీయ నాయకుడిలా ప్రవర్తిస్తున్నారు. అఖిల భారత సర్వీస్ రూల్స్ ఈ ప్రవర్తనను ఏ మాత్రం క్షమించవు. సివిల్ సర్వీస్ అధికారులకు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే బాస్. అయితే ఆ ప్రభుత్వం చెప్పినట్లుగా చేసినా రూల్స్ ప్రకారమే.. రాజ్యంగం ప్రకారమే ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం అయినా రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది. ఆ ప్రభుత్వం తనకు నచ్చలేదని.. గత ప్రభుత్వమే బాగుందని అనుకుంటే ఆయన సర్వీసులో ఉండటానికి అనర్హుడు. స్వచ్చందంగా రాజీనామా చేసి వైదొగలగాలి. కానీ పదే పదే నిబంధనల ఉల్లంఘిస్తూ ఏమైనా అంటే కులం పక్కన దాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో కాపులు, దళితుల గురించి చెప్పి.. ప్రజా ప్రభుత్వంపై విశ్వాసం లేదన్నట్లుగా మాట్లాడారు. ఆయన ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్నారు.
Andhra Pradesh
IPS
PV Sunil
Suspension
Political Controversy
Civil Service Rules
Caste Politics
Bureaucracy
Law and Order
సివిల్ సర్వీస్ నిబంధనలు
రాజకీయ వివాదం
కుల వ్యాఖ్యలు
బ్యూర
Scroll for the next article