Entertainment27th Apr 01:30 PMSunil Byrisetty1 min read

మహేష్ కు ఈడీ షాక్.. నేడు విచారణకు?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆయనకు అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసుల

మహేష్ కు ఈడీ షాక్.. నేడు విచారణకు?
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆయనకు అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులలో బషీర్‌బాగ్‌ లోని ఈడీ కార్యాలయంలో ఉదయం 10.30కి విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు విచారణకు హాజరవుతారా..? లేదా? అన్న సస్పెన్స్ నెలకొంది. సురానా గ్రూప్ కంపెనీలకు ప్రమోషన్స్ చేసేందుకు చెక్కు రూపంలో రూ.3.4 కోట్ల, లిక్విడ్ క్యాష్ రూ.2.5 కోట్లు అంటే మొత్తం రూ.5.90 కోట్ల పారితో షికం తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. మనీ ల్యాండరింగ్‌ కు పాల్పడిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రజలను ఇన్‌ఫ్లుయెన్స్‌ చేశారని మహేశ్ బాబుకు నోటీసులు జారీ అయ్యాయి.
Mahesh Babu
ED Notices
Tollywood
మహేష్ బాబు విచారణ
సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్
సురానా గ్రూప్ కంపెనీలకు ప్రమోషన్స్
మనీ ల్యాండరింగ్‌
Scroll for the next article