News25th Aug 04:42 PMSunil Byrisetty1 min read

సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన

పవన విద్యుత్ రంగంలో ఏపీకి పెద్దఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం హులికెర గ్రామం వద్ద సుజ్లాన్ 1,325 మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్

సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన
పవన విద్యుత్ రంగంలో ఏపీకి పెద్దఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం హులికెర గ్రామం వద్ద సుజ్లాన్ 1,325 మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఆయా పవన విద్యుత్ ప్రాజెక్టులు రాయదుర్గం, ఉరవకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో నెలకొల్పనున్నారు. ఇందులో భాగంగా సుజ్లాన్ S144 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్స్ ను మంత్రి ప్రారంభించారు. రూ.10వేల కోట్ల పెట్టుబడితో సుజ్లాన్ సంస్థ ఏర్పాటుచేయనున్న పవన విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 4వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సుజ్లాన్ సంస్థ ప్రస్తుతం 1,700కు పైగా మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో ఏపీలో అతిపెద్ద విండ్ భాగస్వామిగా అవతరించింది. 2030 నాటికి 5వేల మెగావాట్ల అదనపు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల స్థాపన లక్ష్యంగా సుజ్లాన్ సంస్థ ప్రణాళికలు రూపొందించి, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
Andhra Pradesh
Suzlon
Wind Energy
Nara Lokesh
Renewable Energy
Wind Power Projects
1325 MW
₹10
000 Crore Investment
Anantapur
Rayadurg
స్వచ్ఛ ఇంధనం
పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు
ఏపీ ప్రభుత్వం
ఉద్యోగాలు
పెట్టుబడులు
ఇంధన రంగం
Scroll for the next article