TTD18th Jul 01:34 PMSunil Byrisetty1 min read
స్విమ్స్ కు భారీ విరాళం
పేదలకు సైతం అత్యుత్తమ వైద్యం అందించే స్విమ్స్‌కు భారీ విరాళం అందింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.22.01 కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను విరాళంగా ఇచ్చింది. దివంగత ముఖ్యమంత
పేదలకు సైతం అత్యుత్తమ వైద్యం అందించే స్విమ్స్‌కు భారీ విరాళం అందింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.22.01 కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను విరాళంగా ఇచ్చింది. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు స్విమ్స్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన స్పూర్తితో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడు తెలిపారు. స్విమ్స్ దేశంలో అత్యుత్తమ వైద్య సేవా సంస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని.. దీని కోసం టీటీడీ అవసరమైన సదుపాయాలు కల్పిస్తుందన్నారు. టీటీడీ ఛైర్మన్ ఈ పరికరాలను ప్రారంభించి, స్విమ్స్ సేవలను ప్రశంసించారు.