News3rd Oct 05:05 PMSunil Byrisetty1 min read

స్వచ్ఛ్ సర్వేక్షణ్ తరహాలో స్వచ్ఛాంధ్ర అవార్డులు

స్వచ్ఛభారత్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేస్తున్న స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డుల తరహాలో రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛాంధ్ర అవార్డులను ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబ

స్వచ్ఛ్ సర్వేక్షణ్ తరహాలో స్వచ్ఛాంధ్ర అవార్డులు
స్వచ్ఛభారత్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేస్తున్న స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డుల తరహాలో రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛాంధ్ర అవార్డులను ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేయనున్నట్లు శుక్రవారం స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బి. అనీల్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయిలో అనంతపురం జిల్లా స్శచ్ఛ జిల్లాగా అవార్డు కు ఎంపికయ్యిందన్నారు. రాష్ట్ర స్థాయిలో 69 మంది, జిల్లా స్థాయిలో 1,257 మంది, మొత్తంగా 1,326 మంది విజేతలకు బహుమతులు అందజేయనున్నారన్నారు. ఒకటి నుంచి మూడు లక్షల జనాభా ఉన్న పట్టణాల విభాగంలో గుంటూరు జిల్లాలోని మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ, విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలు అగ్రస్థానాల్లో నిలిచాయని అన్నారు. 50,000 లోపు జనాభా ఉన్న పట్టణాల విభాగంలో చిత్తూరు జిల్లా పలమనేరు మునిసిపాలిటీ, కుప్పం మున్సిపాలిటీ, నెల్లూరు జిల్లా ఆత్మకూరు మునిసిపాలిటీ గుర్తింపు పొందాయని తెలిపారు.
Andhra Pradesh
Swachh Andhra Awards
Swachh Bharat
Chandrababu Naidu
Anantapur Clean District
Municipal Corporations
Guntur Mangalagiri Tadepalli
పలమనేరు మున్సిపాలిటీ
కుప్పం మున్సిపాలిటీ
ఆత్మకూరు మున్సిపాలిటీ
శుభ్రత
పారిశుధ్యం
Scroll for the next article