News7th Mar 10:40 AMSunil Byrisetty1 min read

ప్లాస్టిక్ వద్దు.. స్వచ్ఛాంధ్ర ముద్దు: సీఎస్

పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మూడో శనివ

ప్లాస్టిక్ వద్దు.. స్వచ్ఛాంధ్ర ముద్దు: సీఎస్
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మూడో శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్ర దివస్ నిర్వహించాలని సూచించారు. స్వర్ణాంధ్ర - 2047 లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. చేనేత, జౌళి శాఖలు, MSMEల భాగస్వామ్యంతో పర్యావరణ హితమైన వస్తువుల తయారీని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహితంగా చేయడం ద్వారా రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా చేయవచ్చని సూచించారు. ప్లాస్టిక్ దుష్ర్పభావంపై అవగాహన కల్పించాలని కోరారు.
nature
Plastic Bag
AP
Swachh Andhra Mission
ప్రకృతి
ప్లాస్టిక్ బ్యాగ్
అప్
స్వచ్ఛ ఆంధ్ర మిషన్
Scroll for the next article