National2nd Oct 01:51 PMSunil Byrisetty1 min read

స్వచ్ఛ భారత్ మిషన్ తో సానుకూల మార్పు

రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్ డా. అరవింద్ భదోరియా మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ అభియాన్, అక్టోబర్ 2న మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని వారికి నివాళులు అర్పించి తదనం

స్వచ్ఛ భారత్ మిషన్ తో సానుకూల మార్పు
రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్ డా. అరవింద్ భదోరియా మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ అభియాన్, అక్టోబర్ 2న మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని వారికి నివాళులు అర్పించి తదనంతరం నిర్వహించిన సభలో స్వచ్ఛ భారత్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్‌పై విజయం సాధించిన వనతి శ్రీనివాసన్ ని ప్రత్యేకంగా అభినందిస్తూ సభను ప్రారంభించారు. 70 నుంచి 80 శాతం అనారోగ్యాలకు అపరిశుభ్రతే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను రూపుమాపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్‌ను ఒక సంకల్పంగా తీసుకున్నారని తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ వల్ల వ్యాధుల తీవ్రత తగ్గిందని, దీని ఫలితంగా వైద్య బడ్జెట్ భారం కూడా తగ్గిందని సభలో ఉన్న వైద్యులు సైతం అంగీకరించారని వివరించారు. నేటి పిల్లలు ప్రయాణాల్లో చెత్తను రోడ్లపై పారేయకుండా, తమ వద్దే ఉంచుకుని డస్ట్ బిన్ కనిపించినప్పుడు మాత్రమే అందులో వేస్తున్నారని, ఇది ఒక గొప్ప సానుకూల మార్పు అని కొనియాడారు. ఇది దేశవ్యాప్తంగా ఒక జన జాగరణ, జన విశ్వాస ఉద్యమంగా మారిందని తెలిపారు.
Scroll for the next article