News2nd Oct 01:55 PMSunil Byrisetty1 min read

విజయవాడలో స్వచ్ఛ మారథాన్‌

పరిశుభ్రమైన విజయవాడ, ఆరోగ్యవంతమైన సమాజం లక్ష్యంగా నిర్వహించిన స్వచ్ఛ మారథాన్‌ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రారంభించారు. 5కే, 10కే రన్‌లలో దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల న

విజయవాడలో స్వచ్ఛ మారథాన్‌
పరిశుభ్రమైన విజయవాడ, ఆరోగ్యవంతమైన సమాజం లక్ష్యంగా నిర్వహించిన స్వచ్ఛ మారథాన్‌ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రారంభించారు. 5కే, 10కే రన్‌లలో దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుంచి సుమారు 10 వేల మంది పాల్గొనడం పట్ల ఎంపీ చిన్ని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జుంబా నృత్యంలో పాల్గొని యువతలో ఉత్సాహం నింపారు. విజయవాడ అంటేనే ప్రత్యేకమైన వైబ్రేషన్ అని, ఈ నగరంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకుంటారని అన్నారు. విజయవాడకు స్వచ్ఛత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణలోనూ ప్రత్యేక గుర్తింపు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.గాంధీ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ మారథాన్ కేవలం ఒక రన్ మాత్రమే కాదని, స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన, ఆరోగ్యకరమైన జీవనశైలిపై చైతన్యం, సమాజంలో భాగస్వామ్య భావన పెంపొందించే కార్యక్రమమని ఎంపీ చిన్ని పేర్కొన్నారు. యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషకరమన్నారు. గత ఏడాది ప్రారంభించిన స్వచ్ఛ మారథాన్‌కు వచ్చిన స్పందనతో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు.
Scroll for the next article