News7th Oct 03:09 PMSunil Byrisetty1 min read
త్వరలో ఊరూవాడా స్వచ్ఛ సేవక్ దళాలు!
స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జై స్వచ్ఛ సేవక్ నినాదాన్ని ఇచ్చారని.. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాల్లో స్వచ్ఛ సేవక్ దళాల ఏర్పా
స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జై స్వచ్ఛ సేవక్ నినాదాన్ని ఇచ్చారని.. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాల్లో స్వచ్ఛ సేవక్ దళాల ఏర్పాటుకు కృషిచేయనున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. మంగళవారం నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జిల్లాస్థాయి స్వచ్ఛాంధ్ర పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో తొలుత అతిథులు.. స్వచ్ఛతా వారియర్స్‌తో కలిసి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పట్టాభిరామ్‌తో పాటు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం తదితరులతో కలిసి 50 మంది విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులు, జిల్లా స్థాయిలో 1,257 అవార్డులను వివిధ కేటగిరీల్లో అందించినట్లు పట్టాభి తెలిపారు.