News19th Jul 02:16 PMSunil Byrisetty1 min read
ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆరోగ్యకర జీవన విధానానికి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రతి నెలా 3వ శనివారం స్వర్ణాంధ్ర - స్వచ
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆరోగ్యకర జీవన విధానానికి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రతి నెలా 3వ శనివారం స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒక్కో థీమ్ తో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్న నేపథ్యంలో 3వ శనివారం ప్లాస్టిక్ వాడకం ప్రమాదకరమని తెలుపుతూ ప్లాస్టిక్ భూతాన్ని అంతం చేద్దామన్న నినాదంతో కార్యక్రమం చేపట్టింది. మంత్రి కందుల దుర్గేష్ స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. మంత్రి కందుల దుర్గేష్ ప్రజలు, అధికారులతో కలిసి పలు స్లోగన్స్ చేశారు. ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ సారథ్యంలో స్వచ్ఛాంధ్ర, ప్రధాని మోదీ సారథ్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాలు నిరంతరంగా అమలు చేస్తూ దేశాన్ని, రాష్ట్రాన్ని అత్యంత పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రతి నెలా 3వ శనివారం ఈ తరహా కార్యక్రమాలు చేస్తూ తప్పనిసరిగా ఇంటినే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సందేశాన్ని ఇస్తున్నామన్నారు. అలా ప్రతి నెలా 3వ శనివారం ఒక్కో కార్యక్రమంతో ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నామన్నారు. జులై మాసంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం, గుడ్డ సంచులు వినియోగిద్దాం అన్న నినాదంతో ప్రజల్లోకి వచ్చామన్నారు. స్వచ్ఛత మన లక్ష్యం - ప్లాస్టిక్ ను చేద్దాం దూరం మంత్రి దుర్గేష్ నినదించారు.