News24th Jan 05:07 PMSunil Byrisetty1 min read

స్వచ్ఛాంధ్రతో స్వర్ణాంధ్ర సాకారం!

చిత్తూరు జిల్లా, నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యర్ధాల సేకరణకు ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాలను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా

స్వచ్ఛాంధ్రతో స్వర్ణాంధ్ర సాకారం!
చిత్తూరు జిల్లా, నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యర్ధాల సేకరణకు ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాలను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి మెప్మా, డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం నగరిలో అమృత్ 2.0 కింద రూ.20.13 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నగరి మున్సిపాలిటీలో నీటి సరఫరా పథకం మెరుగుదలకు రూ.13.96 కోట్లు, కాలనీ ప్రాంతాలకు నీటి సరఫరా మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 3.97 కోట్లు, నగరి మున్సిపాలిటీ పరిధిలోని సాయిబాబా ఆలయం సమీపంలో ఉన్న సురగుంట చెరువు పునరుద్ధరణ రూ. 2.20 కోట్లతో పనులు చేపట్టేందుకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Swarna Andhra
Swachhandhra
Chandrababu Naidu
Nagari
Chittoor
Cleanliness
AMRUT 2.0
Water Supply
Development Works
MEPMa
DWCRA
ప్రజారక్షణ
శంకుస్థాపన
మౌలిక సదుపాయాలు
మునిసిపల్ అభివృద్ధి
Scroll for the next article