News29th Sep 05:45 PMSunil Byrisetty1 min read

అక్టోబర్ 2న ‘స్వచ్ఛతాన్’ మారథాన్

అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించే స్వచ్ఛ దివస్ సందర్భంగా విజయవాడ–అమరావతి ప్రాంతంలో “స్వచ్ఛతాన్” మారథాన్ నిర్వహిస్తున్నట్లు స్వచ్ఛ ఆంధ్ర కార

అక్టోబర్ 2న ‘స్వచ్ఛతాన్’ మారథాన్
అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించే స్వచ్ఛ దివస్ సందర్భంగా విజయవాడ–అమరావతి ప్రాంతంలో “స్వచ్ఛతాన్” మారథాన్ నిర్వహిస్తున్నట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పరిశుభ్రత, పారిశుధ్యంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో 2025 జనవరి నుంచి “స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర” ఉద్యమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని ప్రజల్లో మరింతగా ప్రోత్సహించేందుకు గత ఏడాది ప్రారంభించిన “స్వచ్ఛతాన్” రన్ తొలి ఎడిషన్ విజయవంతమైందని, దేశవ్యాప్తంగా సుమారు 6 వేల నుంచి 7 వేల మంది రన్నర్లు పాల్గొన్నారని తెలిపారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న రెండో ఎడిషన్‌కు హెచ్డిఎఫ్సి బ్యాంక్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోందన్నారు. పరిశుభ్రత, పారిశుధ్యం, ఆరోగ్యం అనే ప్రధాన ఇతివృత్తాలతో నిర్వహిస్తున్న “స్వచ్ఛతాన్” మారథాన్‌కు ఈ ఏడాది సుమారు 10 వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు కొమ్మారెడ్డి పట్టాభి రామ్ తెలిపారు.
Scroll for the next article