News2nd Oct 02:13 PMSunil Byrisetty1 min read

విజయవాడలో “స్వచ్ఛతాన్” మారథాన్

విజయవాడ ఎంజీ రోడ్‌లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో “స్వచ్ఛతాన్ 10కే మారథాన్” గురువారం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, శుభ్రత ప్రాముఖ్యత

విజయవాడలో “స్వచ్ఛతాన్” మారథాన్
విజయవాడ ఎంజీ రోడ్‌లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో “స్వచ్ఛతాన్ 10కే మారథాన్” గురువారం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, శుభ్రత ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో చేపట్టిన ఈ మారథాన్ విజయవాడ ఉత్సవ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదయం మొదలైన ఈ కార్యక్రమాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రముఖ సినీ హీరో శర్వానంద్ జెండా ఊపి ప్రారంభించారు. దేశం నలుమూలల నుండి తరలివచ్చిన వందలాది మంది క్రీడాకారులు, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని నగర వీధుల్లో పరుగులు తీశారు. విజేతలుగా నిలిచిన వారికి పతకాలు పంపిణీ చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, “విజయవాడ ప్రజలు శుభ్రతలో ఆదర్శంగా నిలవాలి. యువత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి” అని సూచించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నినాదంతో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చేపట్టిన ఈ కార్యక్రమానికి 11 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు.
Andhra Pradesh
Vijayawada
Swachhtaan Marathon
10K Run
Cleanliness Drive
Environmental Awareness
ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్
కేశినేని శివనాథ్
శర్వానంద్
నగర ఉత్సవం
Scroll for the next article