News12th Jan 04:45 PMSunil Byrisetty1 min read

స్వామి వివేకానంద బోధనలు యువతకు ఆదర్శం

స్వామి వివేకానంద బోధనలను యువత రోల్ మోడల్‌గా తీసుకుని, తమ నైపుణ్యాలను, వ్యక్తిత్వాన్ని పెంపెందించుకోవాలని రామకృష్ణ మఠం సహాయ కార్యదర్శి స్వామి స్థితి కంఠానంద పిలుపునిచ్చారు. స్వామి వ

స్వామి వివేకానంద బోధనలు యువతకు ఆదర్శం
స్వామి వివేకానంద బోధనలను యువత రోల్ మోడల్‌గా తీసుకుని, తమ నైపుణ్యాలను, వ్యక్తిత్వాన్ని పెంపెందించుకోవాలని రామకృష్ణ మఠం సహాయ కార్యదర్శి స్వామి స్థితి కంఠానంద పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 163 వ జయంతిని పురస్కరించుకొని యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తుమ్మలపల్లి కళా క్షేత్రంలో జాతీయ యువజనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివేకానందుని బోధనలను యువత ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. వివేకానందుడు 33 సంవత్సరాలు జీవించి 150 సంవత్సరాల చరిత్రను ప్రపంచానికి అందించారన్నారు. జీవితంలో అతిపెద్ద సవాలు తమ మనస్సును నియంత్రించుకోవడమేనని, మనస్సు అదుపులో ఉంటేనే ఏకాగ్రత పెరుగుతుందని తద్వారా సానుకూల ఆలోచనలు వస్తాయన్నారు. స్వామి వివేకానంద జీవితం, ఆయన చికాగో ప్రసంగం, ఆయన బోధనలు యువతకు గొప్ప స్ఫూర్తినిస్తాయన్నారు. ఆయన రచించిన పుస్తకాలను విద్యార్ధులు చదవడం వల్ల మానసిక స్థైర్యం పెరుగుతుందన్నారు. మన దేశ ఆధ్యాత్మికతను విదేశాలైన కొరియా, జపాన్ లాంటి దేశాలు నేటికీ విరివిగా ఆచరిస్తున్నాయన్నారు. ధృడమైన సంకల్ప శక్తితో ముందుకెళితే యువతకు విజయం సాధ్యపడుతుందని స్వామి స్థితి కంఠానంద తెలియజేశారు.
Indian Spiritual Leader
Swami Vivekananda
Vivekananda Jayanti
Youth Inspiration
Youth Empowerment
National Youth Festival
యువతకు ఆదర్శం
సానుకూల ఆలోచనలు
ఆత్మ నియంత్రణ
Scroll for the next article