News16th Jan 11:06 AMSunil Byrisetty1 min read
స్వర్ణ నారావారి పల్లె తరహాలో స్వర్ణ చంద్రగిరి
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు స్వర్ణ చంద్రగిరి ప్రణాళికల్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్వర్ణ కుప్పం, నారావారి పల్లె తరహాలోనే సుస్థిరా
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు స్వర్ణ చంద్రగిరి ప్రణాళికల్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్వర్ణ కుప్పం, నారావారి పల్లె తరహాలోనే సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా సీఎం ఈ ప్రణాళికల్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. చంద్రగిరి మండలంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఈ అభివృద్ధి ప్రణాళికల్ని అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. స్వర్ణ చంద్రగిరిగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.