News19th Jun 11:23 AMSunil Byrisetty1 min read
వైభవంగా స్వామివారి స్వర్ణ పుష్పార్చన
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానంలో వైదిక సిబ్బంది శాస్త్రోక్తముగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణపుష్పార్చన నిర్వహించారు. స్వర్ణపు
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానంలో వైదిక సిబ్బంది శాస్త్రోక్తముగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణపుష్పార్చన నిర్వహించారు. స్వర్ణపుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సింహాచల పుణ్య క్షేత్రములో దేవస్థాన వేదపండితుల వేదమంత్రాల, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. అర్చకులు వేకువ జామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపములో వేదికపై అధీష్టింపజేసి వేద మంత్రాలు నాధ స్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణపుష్పార్చన, సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామి వారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు.