News17th May 03:53 PMSunil Byrisetty1 min read
మన నుంచే మార్పు మొదలవ్వాలి..
పర్యావరణ హిత క్రమశిక్షణ, సమాజంపై బాధ్యతగా మన నుంచే మార్పు మొదలవ్వాలని, మనం వేసే ఒక చిన్న అడుగు, పెద్ద విజయానికి దారితీస్తుందని, అన్నింటా స్వచ్ఛత మెరుగైన జీవితాని
పర్యావరణ హిత క్రమశిక్షణ, సమాజంపై బాధ్యతగా మన నుంచే మార్పు మొదలవ్వాలని, మనం వేసే ఒక చిన్న అడుగు, పెద్ద విజయానికి దారితీస్తుందని, అన్నింటా స్వచ్ఛత మెరుగైన జీవితానికి బాసటగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. జి.కొండూరులో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర (ఎస్ఏఎస్ఏ) కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఆంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర @ 2047 దార్శనిక పత్రంలోని పది సూత్రాల్లో సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర అనేది ఒక సూత్రంగా ఉందని వివరించారు.
ఈ నేపథ్యంలో ప్రతి నెలా మూడో శనివారం ఒక ప్రత్యేక థీమ్‌తో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల బీట్ ది హీట్ ఇతివృత్తంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు.
ప్రతిఒక్కరూ పర్యావరణం, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని.. తప్పనిసరి పరిస్థితుల్లో విస్తృత ప్రజాప్రయోజన అభివృద్ధి కార్యక్రమం కోసం ఒక చెట్టును నరకడం తప్పనిసరైతే పది మొక్కలు నాటాలని సూచించారు.
హరిత విస్తీర్ణాన్ని పెంచడం వల్ల మనకు, భావితరాలకు ఆరోగ్యకర జీవితం సొంతమవుతుందని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచించారు.