News14th Oct 12:46 PMSunil Byrisetty1 min read

పోరాటానికి దక్కిన గుర్తింపు.. స్వాతి రెడ్డికి పదవి

గత ప్రభుత్వ హయాంలో ట్రోలింగ్‌కు గురై కూడా తెలుగుదేశం పార్టీ కోసం సోషల్ మీడియాలో పోరాడిన స్వాతి రెడ్డికి సరైన గుర్తింపు దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా ఆమెను

పోరాటానికి దక్కిన గుర్తింపు.. స్వాతి రెడ్డికి పదవి
గత ప్రభుత్వ హయాంలో ట్రోలింగ్‌కు గురై కూడా తెలుగుదేశం పార్టీ కోసం సోషల్ మీడియాలో పోరాడిన స్వాతి రెడ్డికి సరైన గుర్తింపు దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా ఆమెను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత పాలనలో స్వాతిరెడ్డి వ్యక్తిత్వ హననానికి గురయ్యారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు గాను ఆమెపై అసభ్యకర పోస్టులు, ట్రోలింగ్, వ్యక్తిగత దూషణలతో తీవ్రస్థాయిలో వేధింపులు సాగాయి. అయితే ఆ బెదిరింపులకు వెరవకుండా ఆమె ధైర్యంగా నిలబడ్డారు. వ్యక్తిగత జీవితంలోనూ ఇటీవలే సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఆమె.. బ్రహ్మం చౌదరిని వివాహం చేసుకున్నారు. స్వయంగా సైబర్ వేధింపుల బాధితురాలిగా క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆమెకు పూర్తి అవగాహన ఉండటంతో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహిళలను కించపరిచే వికృత పోకడలను అరికట్టేందుకు, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూసేందుకు ఆమెకు బాధ్యతలు అప్పగించారు.
Scroll for the next article