Health7th Apr 09:04 AMSunil Byrisetty1 min read

సమ్మర్ స్పెషల్.. చెమట వాసనకు చెక్!

వేసవి కాలంలో బయటకు వెళ్తే చెమట వాసన చిరాకు తెప్పిస్తుంది. దాన్ని పోగొట్టడానికి రకరకాల డియోడరెంట్లు, పెర్ఫ్యూమ్‌లను వాడుతుంటారు. చెమట వాసనకు తాత్కాలికంగా మాత్రమే చెక్ చెప్పే వీటి వల

సమ్మర్ స్పెషల్.. చెమట వాసనకు చెక్!
వేసవి కాలంలో బయటకు వెళ్తే చెమట వాసన చిరాకు తెప్పిస్తుంది. దాన్ని పోగొట్టడానికి రకరకాల డియోడరెంట్లు, పెర్ఫ్యూమ్‌లను వాడుతుంటారు. చెమట వాసనకు తాత్కాలికంగా మాత్రమే చెక్ చెప్పే వీటి వల్ల అంత ప్రయోజనం ఉండదు. అందుకోసం సహజసిద్ధమైన జెల్ ప్రభావవంతంగా పని చేస్తుంది. స్నానం చేసేముందు ఆ నీటిలో 2 గంటల ముందు పటికను వేయండి. కావాలంటే పటికను ఒక బకెట్ నీటిలో రాత్రంతా ఉంచండి. ఉదయం ఈ నీటితో స్నానం చేయండి. మెరుగైన ఫలితాల కోసం, స్నానం చేసిన తర్వాత శరీరంపై కలబంద జెల్ కూడా అప్లై చేయవచ్చు. ఇలా చేయడం వల్ల చెమట వాసన సహజంగా తగ్గడం ప్రారంభమవుతుంది. చెమట దుర్వాసన సమస్యను తొలగించడానికి పటిక పేస్ట్ కూడా ఉపయోగించవచ్చు. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో కొంచెం చల్లటి నీటిని తీసుకోండి. ఇప్పుడు అందులో ఒక పటిక ముక్క వేయండి. ఇది కరిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని దూదితో శరీర భాగాలలో అధిక దుర్వాసన ఉన్న ప్రదేశాలకు పూయండి. పేస్ట్ ఆరిన తర్వాత దానిని నీటితో శుభ్రం చేసుకోండి. తర్వాత మాయిశ్చరైజర్ రాయండి. ఇంక రోజంతా చెమట వాసనకు చెక్ చెప్పేయొచ్చు
Summer
Sweat
వేసవి కాలం
సహజసిద్ధమైన జెల్
Scroll for the next article