News8th May 10:49 AMSunil Byrisetty1 min read

ఆర్టీజీఎస్ అదిరిందన్న స్విట్జర్లాండ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వ్యవస్థ అద్భుతమని, ప్రభుత్వాలకు ఇలాంటి వ్యవస్థల అవసరం ఎంతో ఉందని స్విట్జర్లాండ్ రాయబారి మాయా టిస్సాఫీ అన్నారు.

ఆర్టీజీఎస్ అదిరిందన్న స్విట్జర్లాండ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వ్యవస్థ అద్భుతమని, ప్రభుత్వాలకు ఇలాంటి వ్యవస్థల అవసరం ఎంతో ఉందని స్విట్జర్లాండ్ రాయబారి మాయా టిస్సాఫీ అన్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ను స్విట్జర్లాండ్ రాయబారి, ప్రతినిధులు సందర్శించారు. వారికి ఆర్టీజీస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రఖర్ జైన్ ఆర్టీజీఎస్ పనితీరు గురించి వివరించారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలనే సదాశయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్న ఆలోచనల నుంచి ఆర్టీజీఎస్ వ్యవస్థ రూపుదిద్దుకొందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఈ సంస్థ ఒక వారధిలా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఫలాలు ప్రజలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేరేలా ఈ సంస్థ పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేలా, ప్రజలకు తక్షణ సేవలు అందించేందుకు కావాల్సిన సాంకేతిక తోడ్పాటును ఈ సంస్థ అందజేస్తుందన్నారు.
Andhra Pradesh government
Swiss Ambassador Maya Tissafi
Chandrababu Naidu
RTGS system
రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వ్యవస్థ
ప్రజలకు తక్షణ సేవలు
సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ను స్విట్జర్లాండ్ రాయబారి
Scroll for the next article