News10th Jul 03:23 PMSunil Byrisetty1 min read

సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా రాహుల్

రాయపూడిలోని ఏపీ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో టి. రాహుల్ కుమార్ రెడ్డి అడిషనల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. CRDA ప్రధాన కార్యాలయం 2వ ఫ్లోర్‌లోని ఆయన ఛాంబర్‌ వద్ద శాస్త్రోక్తంగా పూజ

సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా రాహుల్
రాయపూడిలోని ఏపీ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో టి. రాహుల్ కుమార్ రెడ్డి అడిషనల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. CRDA ప్రధాన కార్యాలయం 2వ ఫ్లోర్‌లోని ఆయన ఛాంబర్‌ వద్ద శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రాహుల్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. CRDA ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు తొలుత వివిధ విభాగాల అధికారులు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాహుల్ కుమార్ రెడ్డి.. 5వ ఫ్లోర్‌లోని కమిషనర్ వి. విజయరామరాజుని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం APCRDAలోని పలు విభాగాల ముఖ్య అధికారులు రాహుల్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధానిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నేపథ్యంలో రాహుల్ తన మార్క్ ఎలా చూపిస్తారనే ఆసక్తి నెలకొంది.
Andhra Pradesh
T. Rahul Kumar Reddy
AP CRDA
CRDA
Amaravati
Additional Commissioner
V. Vijayarama Raju
రాజధాని అభివృద్ధి
అమరావతి రాజధాని
పరిపాలనా నియామకాలు
Scroll for the next article