News9th Oct 04:23 PMSunil Byrisetty1 min read
తాడేపల్లిలో తొలిసారిగా ‘ది డ్యుయో ఎడిట్’ లైఫ్‌స్టైల్ ఎక్స్పో
తాడేపల్లిలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ‘ది డ్యుయో ఎడిట్’ లైఫ్‌స్టైల్ ఎక్స్పోను ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డా. శైలజ రాయపాటి సందర్శించారు. ఇలాంటి ప్రదర్శనలు గృహ ఆధారిత వ్యా
తాడేపల్లిలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ‘ది డ్యుయో ఎడిట్’ లైఫ్‌స్టైల్ ఎక్స్పోను ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డా. శైలజ రాయపాటి సందర్శించారు. ఇలాంటి ప్రదర్శనలు గృహ ఆధారిత వ్యాపారవేత్తలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మంచి వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. సాధారణంగా విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో ఎక్కువగా నిర్వహించే లైఫ్‌స్టైల్ ఎక్స్పోను తొలిసారిగా తాడేపల్లిలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. దీనివల్ల మంగళగిరి, తాడేపల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు విభిన్న ఉత్పత్తులను ఒకే వేదికపై చూసి, కొనుగోలు చేసే అవకాశం లభిస్తుందని తెలిపారు. దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో ఎక్స్పో నిర్వహించడం వినియోగదారులతో పాటు వ్యాపారులకు కూడా ప్రయోజనకరమని అభిప్రాయపడ్డారు. విజయవాడ, తెనాలి తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు తమ ఉత్పత్తులతో స్టాళ్లను ఏర్పాటు చేయడం విశేషమని ఆమె అన్నారు. ఇంటి నుంచే వ్యాపారాలు నిర్వహిస్తున్న మహిళలకు తమ ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేసుకోవడానికి, కొత్త వినియోగదారులను చేరుకోవడానికి ఇలాంటి ఎక్స్‌పోలు దోహదపడతాయని పేర్కొన్నారు.