Sports24th Aug 02:59 PMSunil Byrisetty1 min read

స్పీడ్ స్కేటింగ్ పోటీలలో తాడిపత్రి చిన్నారులు

రాష్ట్రస్థాయి స్పీడ్ స్కేటింగ్ పోటీలలో తాడిపత్రి చిన్నారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. కాకినాడలో జరుగుతున్న స్పీడ్ స్కేటింగ్ పోటీలలో బిల్విక రెడ్డి మొదటి స్థానం, ముక్తేశ్వరి ద్విత

స్పీడ్ స్కేటింగ్ పోటీలలో తాడిపత్రి చిన్నారులు
రాష్ట్రస్థాయి స్పీడ్ స్కేటింగ్ పోటీలలో తాడిపత్రి చిన్నారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. కాకినాడలో జరుగుతున్న స్పీడ్ స్కేటింగ్ పోటీలలో బిల్విక రెడ్డి మొదటి స్థానం, ముక్తేశ్వరి ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. ముక్తేశ్వరి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్, బిల్విక రెండు సిల్వర్ మెడల్స్ సాధించినట్లు కోచ్ సాంబశివ తెలిపారు. 8 ఏళ్ల బిల్వికారెడ్డి రింక్ -4 లో సిల్వర్, రింక్ - 5లో సిల్వర్ మెడల్స్ సాధించగా... 10ఏళ్ల ముక్తేశ్వరి క్యాడేట్ రోడ్డు విభాగంలో గోల్డ్ మెడల్, రింక్ - 6లో బ్రాంజ్, రింక్ - 5 లో సిల్వర్ మెడల్ సాధించినట్లు తెలిపారు. చిన్న వయసులోనే అటు చదువులో, ఇటు క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు.
Andhra Pradesh news
sports
Tadipatri Kids
Speed Skating
Bilvik Reddy
Mukteshwari
State-Level Sports
Young Athletes
రాష్ట్ర స్థాయి క్రీడలు
స్పీడ్ స్కేటింగ్ పోటీలు
Scroll for the next article