News13th Nov 04:38 PMSunil Byrisetty1 min read
రాష్ట్ర ప్రభుత్వ సహకారం అద్భుతం
తైవాన్ కంపెనీలు ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కుకు భూములు కేటాయిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పారిశ్రామిక పార్కులకు వివిధ రహదారులను అనుసంధానిస్తామని పేర్కోన్నారు. కర్ణ
తైవాన్ కంపెనీలు ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కుకు భూములు కేటాయిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పారిశ్రామిక పార్కులకు వివిధ రహదారులను అనుసంధానిస్తామని పేర్కోన్నారు. కర్ణాటక, ఏపీ, తమిళనాడు రీజియన్లను కలుపుతూ ఈ రహదారి మార్గాలు ఉన్నాయని తైవాన్ ప్రతినిధులకు వివరించారు. తైవాన్ కంపెనీలకు అవసరమైన నైపుణ్యం ఉన్న మానవ వనరుల్ని తయారు చేసేందుకు సిద్ధమని సీఎం వెల్లడించారు. తైవాన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఏపీలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఏపీలో పరిశ్రమలు, పెట్టుబడులకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వ సహకారం బాగుందని తైవాన్ బృందం కొనియాడింది.