News30th Jul 11:01 AMSunil Byrisetty1 min read

ఏపీలో పెట్టుబడులకు తైవాన్ కంపెనీల ఆసక్తి

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ సంస్థలు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు సహా అధునాత తయారీ, సాంకేతిక

ఏపీలో పెట్టుబడులకు తైవాన్ కంపెనీల ఆసక్తి
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ సంస్థలు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు సహా అధునాత తయారీ, సాంకేతిక రంగాల్లో ఏపీతో భాగస్వామ్యాన్ని మరింత పెంచుకునే దిశగా తైవాన్ పారిశ్రామిక ప్రతినిధుల బృందం సిద్ధమైంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యింది. తైవాన్ కు చెందిన డెల్టా ఎలక్ట్రానిక్స్, బెన్ క్యూ, సీబీటీసీ బ్యాంక్, డైమెర్కో, మాస్టర్ హిల్, నాన్ పావోరెసిన్స్, ఎవర్ క్లియర్ ఎన్విరానమెంటల్ ఇంజనీరింగ్, షెంగ్ హుయ్ టెక్, టెక్ టాప్ ఇంజనీరింగ్, కేఎస్ టెర్మినల్స్, శాండ్ సన్, జిలీ కనస్ట్రక్షన్స్ అండ్ ఇంజనీరింగ్, కపెల్లా స్టోర్స్ వంటి అంతర్జాతీయ స్థాయి దిగ్గజ సంస్థల కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైలు, రోడ్డు మార్గాల వంటి పటిష్టమైన లాజిస్టిక్స్ నెట్వర్క్ సహా ఏపీలోని తయారీ రంగ ఎకోసిస్టమ్ గురించి సీఎం తైవాన్ ప్రతినిధుల బృందానికి వివరించారు.
Andhra Pradesh
N Chandrababu Naidu
Taiwan
Taiwanese Companies
Foreign Investment
Electronics Manufacturing
పారిశ్రామిక పెట్టుబడులు
తయారీ రంగం
మౌలిక వసతులు
ఏపీ ప్రభుత్వం
వ్యాపార వార్తలు
Scroll for the next article