News30th Jan 12:58 PMSunil Byrisetty1 min read
ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి
టౌన్, వార్డు, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కోసం నిర్వహించిన 11వ శిక్షణ తరగతుల్లో మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గ
టౌన్, వార్డు, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కోసం నిర్వహించిన 11వ శిక్షణ తరగతుల్లో మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. పార్టీ క్యాడర్ సమన్వయంతో పాటు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉందని లోకేష్ స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా ఓర్పుతో, ఐక్యంగా దుష్ప్రచారాలను ఎదుర్కోవాలని సూచించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. 2014–19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినా, వాటిని ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లడంలో వెనుకబడ్డామని లోకేష్ గుర్తు చేశారు. అదే అప్పటి ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి కార్యక్రమాన్ని ప్రజలకు నేరుగా వివరించాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని తెలిపారు. ఇకపై అభివృద్ధితో పాటు, తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేసే శక్తులను ధీటుగా ఎదుర్కోవాలని స్పష్టం చేశారు.