News21st May 11:18 AMSunil Byrisetty1 min read
తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల డ్రైవర్ల సమ్మె
గర్భిణులు, బాలింతలకు సేవలందించే తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు నిలిచిపోనున్నాయి. అవుట్సోర్సింగ్ నిబంధనల ప్రకారం గౌరవ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తల్లీ బిడ్డ ఎక్సప్రెస్ వా
గర్భిణులు, బాలింతలకు సేవలందించే తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు నిలిచిపోనున్నాయి.
అవుట్సోర్సింగ్ నిబంధనల ప్రకారం గౌరవ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తల్లీ బిడ్డ ఎక్సప్రెస్ వాహనాల డ్రైవర్లు సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తే కేవలం 8,000 రూపాయల జీతం మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిబంధనల ప్రకారంగా 18, 500 రూపాయలు చెల్లింపులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ భద్రత మరియు ఈ.ఎస్.ఐ సౌకర్యాలు కల్పించాలని తల్లీ బిడ్డ ఎక్సప్రెస్ వాహనాల డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు