Technology5th Aug 10:09 AMSunil Byrisetty1 min read
వాహనాలూ మాట్లాడుకుంటాయి.. ప్రమాదాలకు చెక్!
కార్లు వంటి వాహనాలు నడిపేటప్పుడు ఒక్క సెకన్ ఆదమరుపు చాలు ప్రమాదానికి కారణమవడానికి. అలాంటి అకస్మాత్ ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం అధునాతన వ్యవస్థను తీసుకురావాలని యోచిస్
కార్లు వంటి వాహనాలు నడిపేటప్పుడు ఒక్క సెకన్ ఆదమరుపు చాలు ప్రమాదానికి కారణమవడానికి. అలాంటి అకస్మాత్ ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం అధునాతన వ్యవస్థను తీసుకురావాలని యోచిస్తోంది. అందుకోసం 'టాకింగ్ వెహికల్స్' తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 2028 అక్టోబర్ 1 నుంచి కొత్త వాహనాల్లో Vehicle-to-Vehicle (V2V) వ్యవస్థను తప్పనిసరి చేయాలని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వ్యవస్థ ద్వారా వాహనాలు ఒకదానితో ఒకటి రియల్‌టైమ్ సమాచారాన్ని పంచుకుని, ప్రమాదాలు జరిగే ముందే డ్రైవర్లకు హెచ్చరికలు అందించే అవకాశం ఉంటుంది. వైఫై ద్వారా సెన్సర్లు ముందు, పక్కన, వెనుక వెళ్లే వాహనాల మధ్య దూరాన్ని గుర్తించి అప్రమత్తమై ప్రమాదాలను నివారిస్తాయి.