News22nd Jul 03:06 PMSunil Byrisetty1 min read
తల్లికి వందనంతో పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు
బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలని కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండో ఏడాది తల్లికి వందనం పథకం నిధులు జమ చేసిందని టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు అన
బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలని కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండో ఏడాది తల్లికి వందనం పథకం నిధులు జమ చేసిందని టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు అన్నారు. గత ప్రభుత్వంలో బటన్లు నొక్కారు కానీ లబ్ధిదారులకు డబ్బులు మాత్రం జమ కాలేదని విమర్శించారు. నేడు కూటమి ప్రభుత్వంలో చెప్పిన సమయానికి చెప్పిన విధంగా నిధులు మంజూరు చేస్తూ ఇచ్చిన హామీలను అమలు చేశామని అన్నారు. నేడు రాష్ట్రంలోని తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జమ చేస్తున్నామని చెప్పారు. మొత్తం 67,47,190 మంది విద్యార్థులకు రూ.10,120 కోట్లు తల్లికి వందనం డబ్బులు సుమారు 42,70,842 మంది తల్లుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. ఇంత పెద్ద మొత్తం నిధులు అవినీతికి తావులేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న ప్రభుత్వం మాదే అని గర్వంగా చెప్పుకుంటున్నామని తెలిపారు. నిరుపేద కుటుంబాల్లో ఇద్దరు ముగ్గురు పిల్లల్లో చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉండేదని, కానీ తల్లికి వందనం పథకం అమలుతో ఆ సమస్య పేద కుటుంబాల్లో దూరమైందని వివరించారు.