Entertainment31st Oct 04:55 PMSunil Byrisetty1 min read

హత్య కన్నా అబద్ధం పెద్దది: తమన్నా

సినీ నటి తమన్నా తన మనసులో మాటలు ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. "నాకు అబద్ధాలు చెప్పేవాళ్లను చూస్తే అస్సలు సహించలేను. ఏదైనా తప్పు జరిగినా, సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడానికి నేను స

హత్య కన్నా అబద్ధం పెద్దది: తమన్నా
సినీ నటి తమన్నా తన మనసులో మాటలు ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. "నాకు అబద్ధాలు చెప్పేవాళ్లను చూస్తే అస్సలు సహించలేను. ఏదైనా తప్పు జరిగినా, సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉంటాను. అవసరమైతే మీరు ఒక హత్య చేసినా దాన్ని కప్పిపుచ్చడానికి నేను సాయం చేస్తానేమో. కానీ, అబద్ధాలు చెప్పే వారిని మాత్రం నేను భరించలేను" అని అన్నారు. "నా ముఖం మీదే అబద్ధం చెప్పి, దాన్ని నేను నమ్మేంత మూర్ఖురాలిని అని అవతలి వారు అనుకున్నప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. సమస్య కేవలం అబద్ధం చెప్పడం కాదు, అవతలి వారు మనల్ని అంత తెలివితక్కువ వారని భావించడమే అసలు సమస్య" అని తమన్నా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. తాను ఒక గొప్ప జీవిత భాగస్వామిగా మారేందుకు ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు. "ఎవరి జీవితంలోకి నేను వెళ్లినా, వారు గత జన్మలో ఏదో పుణ్యం చేసుకున్నందుకే నేను దొరికానని భావించాలి. ఆ అదృష్టవంతుడి కోసం నేను నన్ను నేను తీర్చిదిద్దుకుంటున్నాను" అని ఆమె చెప్పడం గమనార్హం. తాజా వ్యాఖ్యలతో బంధంలో నిజాయతీకి ఆమె ఎంత విలువిస్తారో స్పష్టమవుతోంది.
Tamannaah Bhatia
Interview
Honesty
Relationships
Tollywood
Celebrity News
Truth
Integrity
Tamil Cinema
Telugu Cinema
Scroll for the next article