News23rd Jun 03:19 PMSunil Byrisetty1 min read
డ్రగ్స్ కేసులో కోలివుడ్ హీరో అరెస్ట్!
డ్రగ్స్ కేసులో ఇటీవల సినీ నటుల అరెస్టులు కలకలం రేపుతున్నాయి. తాజాగా కోలీవుడ్ హీరో శ్రీరామ్ మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ అయ్యారు. కొన్ని తెలుగు చిత్రాల్లోనూ నటించిన శ్రీరామ్‌ను చెన్న
డ్రగ్స్ కేసులో ఇటీవల సినీ నటుల అరెస్టులు కలకలం రేపుతున్నాయి. తాజాగా కోలీవుడ్ హీరో శ్రీరామ్ మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ అయ్యారు. కొన్ని తెలుగు చిత్రాల్లోనూ నటించిన శ్రీరామ్‌ను చెన్నై పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. ఏఐఏడీఎంకే మాజీ నేత ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ అరెస్ట్ జరిగింది. చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా నటుడు శ్రీరామ్‌ను అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన శ్రీరామ్ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. ఇటీవలే 'హరికథ' అనే వెబ్ సిరీస్‌లో కూడా శ్రీరామ్ కనిపించారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో, విజయ్ హీరోగా వచ్చిన 'స్నేహితులు' చిత్రంలో జీవాతో కలిసి శ్రీరామ్ కీలక పాత్ర పోషించారు.