News7th Aug 05:30 PMSunil Byrisetty1 min read

సీఎంతో విడాకుల కేసు వాపస్

తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ భార్య సంగీత విడాకుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఎన్నికల ముందు దాఖలు చేసిన పిటిషన్‌ను ఆయన భార్య సంగీత వెనక్కితీసుకు

సీఎంతో విడాకుల కేసు వాపస్
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ భార్య సంగీత విడాకుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఎన్నికల ముందు దాఖలు చేసిన పిటిషన్‌ను ఆయన భార్య సంగీత వెనక్కితీసుకున్నారు. ఈ మేరకు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఆమె విజ్ఞప్తి చేయగా, న్యాయమూర్తి విడాకుల కేసును ముగిస్తున్నట్లు తీర్పు వెలువరించారు. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి, తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన విజయ్ వ్యక్తిగత జీవితంపై చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. నటి త్రిషతో ఆయనకు వివాహేతర సంబంధం ఉందన్న వార్తలూ హల్‌చల్‌ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. విజయ్, సంగీతను 1999 ఆగస్టు 25న వివాహం చేసుకున్నారు. ఈ జంటకు కుమారుడు జేసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా ఉన్నారు. తాజాగా కేసు కొనసాగించడం ఇష్టం లేక సంగీత తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.
Entertainment news
Joseph Vijay
Vijay
Sangeetha
Tamil Nadu
Divorce Petition
Family Court
Tamil Cinema
కోలీవుడ్
తమిళ సినిమా
ప్రముఖుల వార్తలు
త్రిష
వినోద వార్తలు
తమిళనాడు
Scroll for the next article