News17th Oct 10:08 AMSunil Byrisetty1 min read
కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు గవర్నర్
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీపావళి ముందు రోజులు, వీకెండ్ కావడంతో దర్శనానికి
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీపావళి ముందు రోజులు, వీకెండ్ కావడంతో దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం అమ్మవారిని తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి దర్శించుకున్నారు. గవర్నర్ రావడంతో ఆలయ అధికారులు, పాలకమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ రవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గవర్నర్ కు పండితులు వేదాశీర్వచనం అందించారు.