News20th Jan 04:33 PMSunil Byrisetty1 min read
అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన గవర్నర్
జాతీయ గీతానికి గౌరవం ఇవ్వలేదంటూ అసెంబ్లీ నుంచి గవర్నర్ వెళ్లిపోయిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు సభనుద్దేశించి ప్రసం
జాతీయ గీతానికి గౌరవం ఇవ్వలేదంటూ అసెంబ్లీ నుంచి గవర్నర్ వెళ్లిపోయిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు సభనుద్దేశించి ప్రసంగించాల్సి ఉన్న గవర్నర్ ఆర్.ఎన్. రవి జాతీయ గీతానికి సరైన గౌరవం ఇవ్వలేదని సీరియస్ అయ్యారు. అదే కారణంతో ఆయన అసెంబ్లీ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. గతంలోనూ ఇలాగే సభ నుంచి వెళ్లిపోయిన సందర్భాలున్నాయి. దీంతో తమిళనాడు రాజకీయాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.