News18th Mar 02:01 PMSunil Byrisetty1 min read
చెన్నైలో ఉన్నారా.. ఐపీఎల్ ఆఫర్ మీకోసమే!
ఐపీఎల్ సీజన్లో అదిరిపోయే ఆఫర్ వచ్చేసింది. తమిళనాడు చెన్నైలోని ప్రయాణికులకు మెట్రో శుభవార్త చెప్పింది. ఐపీఎల్ సీజన్లో చెన్నైలో ప్రయాణికులందరికీ ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. అందుకోస
ఐపీఎల్ సీజన్లో అదిరిపోయే ఆఫర్ వచ్చేసింది. తమిళనాడు చెన్నైలోని ప్రయాణికులకు మెట్రో శుభవార్త చెప్పింది.
ఐపీఎల్ సీజన్లో చెన్నైలో ప్రయాణికులందరికీ ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. అందుకోసం చెన్నై సూపర్ కింగ్స్‌తో చెన్నై మెట్రో రైల్ ఒప్పందం కుదుర్చుకుంది.
క్రికెట్ మ్యాచ్ లు చూసే ప్రతి వీక్షకుడికి బోనస్‌లా ఈ ఆఫర్ ఉంది. ఐపీఎల్ లో జరిగే ప్రతి మ్యాచ్ కు వెళ్లే ప్రేక్షకుడికి ఉచిత ప్రయాణం అందించనుంది.
మెట్రో స్టేషన్ నుంచి గవర్నర్ మెంట్ ఎస్టేట్ వరకూ రాను పోను మెట్రో రైలు సేవలు వినియోగించుకోవచ్చు.
ఈ ఉచిత ప్రయాణ సదుపాయం క్రికెట్ మ్యాచ్‌లు జరిగే రోజుల్లో మాత్రమే అందిస్తారు.
రాను పోను మెట్రో రైలు సేవలు వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
మ్యాచ్ జరిగిన రోజు మాత్రం అర్ధరాత్రి ఒంటి గంట వరకూ మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి.
ప్రయాణికుల డిమాండ్ ను బట్టి మెట్రో రైలు సేవల వేళలను ప్రకటించనున్నారు.