Politics12th Apr 10:46 AMSunil Byrisetty1 min read
తమిళనాడులో త్రిముఖ పోరు?
తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ పోటీలో ఉండగా.. సమీకరణాలు మారాయి. బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు ఖరారైంది. 2026 ఎన్నికల్లో బీజేపీ, అన్న
తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.
ఇప్పటి వరకు డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ పోటీలో ఉండగా.. సమీకరణాలు మారాయి.
బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు ఖరారైంది.
2026 ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి పోటీచేయనున్నాయి ఎన్డీఏ కూటమిలో చేరిన అన్నాడీఎంకే తన పంతం నెగ్గించుకుంది.
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైని ఆ పదవిలోంచి తొలగించాలని డిమాండ్ చేసి నెగ్గింది.
తాజాగా బీజేపీ సైతం తమిళనాడు సీఎం అభ్యర్థిగా పళనిస్వామిని ప్రకటించింది.
ఎలాంటి షరతులు లేకుండానే పొత్తు ఉంటుందని కేంద్రహోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు.
పళనిస్వామి నేతృత్వంలో తమిళనాడులో పోటీ చేస్తామని పేర్కొన్నారు.. అయితే సూపర్ స్టార్ విజయ్ టీవీకే పార్టీని పెట్టడంతో చాలామంది అటువైపు మొగ్గుతున్నారు. దీంతో తమిళనాడులో ఎన్డీయే, యూపీఏ, టీవీకే మధ్య త్రిముఖ పోరు జరుగుతుందని అంచనాలు వేస్తున్నారు