Entertainment6th Jul 03:21 PMSunil Byrisetty1 min read

అంగరంగవైభవంగా తానా మహాసభలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 24వ ద్వై వార్షిక మహాసభలు డిట్రాయిట్‌ సబర్బ్‌ నోవైలో ఉన్న సబర్బన్‌ కలెక్షన్‌ షోప్లేస్‌ లో వైభవంగా ప్రారంభమైంది. బాంక్వెట్‌ కార్యక్రమం, మహాసభలకు దాదా

అంగరంగవైభవంగా తానా మహాసభలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 24వ ద్వై వార్షిక మహాసభలు డిట్రాయిట్‌ సబర్బ్‌ నోవైలో ఉన్న సబర్బన్‌ కలెక్షన్‌ షోప్లేస్‌ లో వైభవంగా ప్రారంభమైంది. బాంక్వెట్‌ కార్యక్రమం, మహాసభలకు దాదాపు 12 వేలమంది రావడంతో నిర్వాహకులు ఉత్సాహంగా కనిపించారు. చివరిరోజున ఈ సంఖ్య మరింత పెరగవచ్చని వారు చెప్పారు. బాంక్వెట్‌ కార్యక్రమాలు తానా కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ గంగాధర్‌ నాదెళ్ళ, కన్వీనర్‌ ఉదయ్‌ కుమార్‌ చాపలమడుగు, కాన్ఫరెన్స్‌ నాయకులు సునీల్‌ పంట్ర, కిరణ్‌ దుగ్గిరాల, జో పెద్దిబోయిన తదితరుల ఆధ్వర్యంలో సాగాయి. ఈ సందర్భంగా పలు విభాగాల్లో సేవలందించిన వారికి తానా మెరిటోరియస్‌ అవార్డులను బహుకరించారు. సైంటిఫిక్‌ రీసెర్చ్‌, ఎంట్రప్రెన్యూర్‌ షిప్‌‌లో ప్రతిభ చూపినందుకు డా. బెజవాడ శ్రీనివాసరావుకు అవార్డును బహకరించారు. మెడిసిన్‌ విభాగంలో డాక్టర్‌ ముక్కామల శ్రీనివాస్‌‌కు అవార్డును ఇచ్చారు. లిటరేచర్‌ విభాగంలో తానా ఎక్సలెన్స్‌అవార్డును డా. వడ్లమూడిబాబుకు అందించారు. అకాడమిక్‌ ఆచీవ్‌మెంట్స్‌కు నాదెళ్ళ ప్రణయ్‌‌కు, ఫైనాన్షియల్‌ టెక్నాలజీ రంగంలో ప్రతిభ చూపిన యార్లగడ్డ రఘుకు, పొలిటికల్‌ విశ్లేషకుడు ఆది సతికి, మెడిసిన్‌,కమ్యూనిటీ సర్వీస్‌‌కు డా. కాకర్ల జగన్మోహనరావుకు, సాహిత్యవిభాగంలో ప్రసాద్‌ తోటకూరకు, తెలుగు బ్రాడ్‌ కాస్టింగ్‌ లో ఉదయగిరి రాజేశ్వరికి, మెడిసిన్‌, జీన్‌ థెరపికి గాను డా. ముసునూరు కిరణ్‌కు, ఫైనాన్స్‌ టెక్నాలజీలో డాక్టర్‌ పరుచూరి శ్రీనివాస్‌కు, సర్వీస్‌ విభాగంలో డా. నల్లమోతు బ్రహ్మాజీకి, ఎడ్యుకేషన్‌, కమ్యూనిటీ సర్వీస్‌లో డా. చెరుకుపల్లి నెహ్రూకు, అగ్రికల్చర్‌ విభాగంలో పాతూరి నాగభూషణంకు, కమ్యూనిటీ సర్వీస్‌ లో తిపిర్నేని తిరుమలరావుకు అందించారు.
America
TANA 24th Conference
NRIs Celebrate Culture & Unity
24th TANA 2025 From Detroit
అంగరంగవైభవంగా తానా మహాసభలు
Scroll for the next article