News7th Sep 05:18 PMSunil Byrisetty1 min read

పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో టాస్క్ ఫోర్స్ కు బంగారు పతకాలు

విజయవాడలో జరిగిన మొదటి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో పతకాలు సాధించిన ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్) పోలీసులను టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ

పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో టాస్క్ ఫోర్స్ కు బంగారు పతకాలు
విజయవాడలో జరిగిన మొదటి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో పతకాలు సాధించిన ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్) పోలీసులను టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ శ్రీనివాస్ సోమవారం అభినందించారు. రెండు రోజుల క్రితం జరిగిన పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు కు పతకాల పంట పండింది. వాటర్ స్పోర్ట్స్ కాయాకింగ్ విభాగంలో ఎం. హాజువలి కి రెండు గోల్డ్, ఒక సిల్వర్, మూడు బ్రాంజ్ పతకాలను సాధించారు ఇంకా ఏ. విద్యాసాగర్ కు ఒక గోల్డ్, ఒక సిల్వర్, మూడు బ్రాంజ్ పతకాలు సాధించారు. వారిని అభినందించిన ఎస్పీ పీ శ్రీనివాస్ మాట్లాడుతూ వారు చేపట్టిన కృషితోనే పతకాలు సాధించుకున్నారని, టాస్క్ ఫోర్స్ కు పేరు తీసుకుని వచ్చారని తెలిపారు. ఇలాంటి పతకాలు భవిష్యత్తు లో మరిన్ని సాధించాలని ప్రోత్సహించారు. వారిని అభి అభినందించిన వారిలో ఏఎస్పీ జె. కులశేఖర్, డీఎస్పీలు వీ శ్రీనివాసరెడ్డి, బీ. సాయి గిరిధర్, ఏసీఎఫ్. జె.శ్రీనివాస్ ఉన్నారు. క్రీడాకారులను సత్కరించి అభినందనలు వ్యక్తం చేశారు.
AP State Police Sports Meet
Police Sports
RSASTF
Red Sanders Task Force
Vijayawada
P Srinivas
ఎం హాజువలి
ఏ విద్యాసాగర్
కాయాకింగ్
బంగారు పతకాలు
ఆంధ్రప్రదేశ్ పోలీస్
పోలీస్ గేమ్స్
Scroll for the next article